శ్రీరాముడిని భర్తగా కోరిన చంద్రసేన కథ
కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జయలలిత, కాంతారావు, ఎస్వీ రంగారావు ముఖ్య పాత్ర ల్లో నటించిన చిత్రం ‘శ్రీకృష్ణ సత్య’. ఈ పౌరాణిక చిత్రం 1971 డిసెంబర్ 24న విడుదలైంది. అప్పట్లోనే పౌరాణిక కథకు కల్పన జోడించి ఈ చిత్రకథను రూపొందించారు. శ్రీరామ రావణ యుద్ధం లో రావణుడు పరాజ యం అంచున నిలవడంతో మైరావణుని సా యం కోరుతాడు.
దీంతో రామలక్ష్మణులను కాళికా దేవికి బలి ఇస్తానని మైరావణుడు ప్రతిన బూనుతా డు. విషయం తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణులకు తోకతో కోటను నిర్మించి అగ్ర భాగాన కూర్చొంటాడు. మైరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి రామలక్ష్మణులను బొమ్మలుగా మార్చి పాతాళలోకానికి తీసుకెళతాడు. వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాళ లోకానికి వెళతాడు.
మైరావణుడి ప్రాణ రహస్యం తెలిస్తే అతడిని సంహరించడం సాధ్యమవుతుంది. దీనికి శ్రీరాముడిని భర్తగా చేసుకోవాలని కలలు కంటున్న చంద్రసేన సాయం కోరతాడు. ప్రతిగా శ్రీరాముడు తన స్వామి కావాలని చంద్రసేన కోరుతుంది. అంతరార్ధం తెలియని హనుమంతుడు మాటిస్తాడు. ఆ తరువాత చంద్రసేన సాయంతో రామలక్ష్మణులను హనుమంతుడు రక్షిస్తాడు.
మరి ఏకపత్నీవ్రతుడైన రాముడు.. చంద్రసేనను ఎలా వివాహం చేసుకుంటాడు? హనుమంతుడు ఇచ్చిన మాట ఏమైంది? వంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందింది.






