6 March, 2026 | 7:55 AM

పందుల పెంపకం కోసమే వాగు

06-03-2026 01:24 AM

ఊక చెట్టు వాగు ప్రాంతమంతా పందుల కోసమేనా?

దర్జాగా చికెన్ విడతల సేకరణ వాగులో విసిరివేత 

పందుల దందా ఒకవైపు.. ప్రజల ఆరోగ్యం మరోవైపు

చూసి చూడనట్టు వివరిస్తున్న అధికార యంత్రాంగం

నీటి కాలుష్యంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు 

చిన్నచింతకుంట మార్చి ౫ : భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది. మని షి మనుగడకు ఏ జీవి ముప్పు తీసుకువచ్చి న వాటిని ఊరికి దూరంగా ఉంచి వాటి మ నుగడ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టే విష యం ఆమోదయోగ్యమే. ఈ నిబంధనలు ఆ గ్రామంలో ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. మండల కేంద్రంలోని మరిటోని గడ్డ  హిందూ స్మశానా వాటిక సమీపంలోని ఊక చెట్టు వాగు తీరం వెంబడీ పందుల స్తావరాలుతో పందుల పెంపకానికి అడ్డగా మారిం ది.

ఇట్టి నీళ్లు అతి దుర్గంధంగా, మురుగునీటిలా మారిపోయాయని. స్థానిక వార్డ్ మెం బర్లు,స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కాగా ఊరికి దూరంగా పందుల షె డ్డు ని ఏర్పాటు చేసి వాటికి అవసరమైన తి ను బండారులను అందుబాటులో ఉంచి పెంచుకోవాల్సిన పందుల పెంపకదారులు ఆ నిబంధనలో ఏమి పట్టించుకోకుండా నది పరివాహక ప్రాంతం లో కంచ ఏర్పాటు చేసి ఆ నీటిలోనే చికెన్ వ్యర్థాలను వేసి తక్కువ సమయంలోనే అధిక బరువు కలిగించేలా పందులను పెంచుతున్నారు. ఈ నది పరివాహక ప్రాంతం ఆ ప్రాంతంలోని పలు గ్రామాలను విస్తరించుకుంటూ నీరు పారుతుంది.

చికెన్ వ్యర్థాలతో పందుల మలవిస ర్జనతో నది లోని నీరు పూర్తిస్థాయిలో కలుషితమై ప్రవహిస్తుందని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. నీటికి కొంచెం దూరంగా ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసి పెంచాల్సిన పెంపకదారులు మాత్రం అలాంటి చర్యలు తీసుకోకుండా ఇతరుల అనారోగ్యానికి గురి అవ్వడానికి కారణం అవుతున్నారు.

- అధికారులు అటువైపే చూడట్లే.. వాగు తీరంలో పందులు

మండల అధికారులతో పాటు గ్రామపంచాయతీలోని అధికారుల సైతం నది ప రివాహ ప్రాంతంలోనే కంచ ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాలను వాటిలో ఉంచి పంతులను పెంచుతున్నప్పటికీ అటువైపే చూడడమే మానేశారని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్య క్తం చేస్తుండ్రు. కొంతమంది నేతల అండదండలు ఉండడంతో పందుల పెంపకదారులు ఎవరు ఏం చేస్తారులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారని నది పరివాహక ప్రాంతంలో ఉంచి చికెన్ వ్యర్థాలను తీసుకువచ్చి వేసి ఇష్టం సారంగా పందుల పెంపకం కి పాల్పడుతున్నారని ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేసి పందులను పెంచాలని వారు సూచిస్తున్నారు.

ఈ ప్రక్రియ ముగింపు పలక పోతే భవిష్యత్తులో ఎన్నో రోగాలకు ఈ  కలిసితమైన నీటిని ఉపయోగించి తీవ్ర ఇబ్బం దులకు గురై అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పందుల స్థావరాలు  (కాలేయాలు, పేగులు వంటి అవయవాలు) వాగుల్లో విసిరితే, అవి సూక్ష్మజీవులు, ప్యాథోజెన్స్తో కలు షితమవుతాయి. ఇవి నీటిలో కుళిరించి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, చేపలు, జలజీ వులకు మరణకారణమవుతాయి . రసాయనాలు, బ్యాక్టీరియా (ఈ.కోలై, సాల్మోనెల్లా) వ్యాప్తి చెందుతూ నీరు మరింత విషపూరితమవుతుంది స్థానిక గ్రామాలలో ఆరోపిస్తున్నారు .

 ఎవరు చెబితే వింటారు...: వాకిట మధు, చిన్నచింతకుంట 

 ఒక చెట్టు వాగు తీరం వెంబడి పందుల స్తావరాల ఉండడం వలన  తాగునీటికి ము ప్పు. గత కొన్ని వారాలుగా, మా కుళాయిల లో మురికి, దుర్వాసనతో కూడిన నీరు వ స్తోంది. ఈ నీరు స్పష్టంగా కలుషితమై, ఉం టుంది తాగడానికి  మరియు గృహ వినియోగానికి కూడా పనికిరాదు. ఈ పరిస్థితి నివాసితుల ఆరోగ్యాని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోగలి 

నీటి కలుషితంతో ప్రమాదం  : డాక్టర్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 

నీటి కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులకు కారణమవు తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవుల వంటి కారకాల వల్ల వ్యాపిస్తుంది. సా ధారణ వ్యాధులుకలరా.తీవ్ర విరేచనాలు, వాంతులు, విబ్రియో కాలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది.టైఫాయిడ్ జ్వరం: జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి,సాల్మోనెల్లా టైఫీ బ్యా క్టీరియా కారణం.డైసెంట్రీ, అమీబియాసిస్: రక్తం కలిసిన విరేచనాలు, పొట్ట నొప్పి, షిగె ల్లా, అమీబాల వల్ల.హెపటైటిస్ ఎ, కలేయ ఇన్ఫెక్షన్, మగతో జాండిస్, మురికి నీరు ద్వారా వ్యాప్తి.ఇ.కోలై ఇన్ఫెక్షన్లు: కడుపు సమస్యలు, తీవ్రమైతే మూత్రపిండాల సమస్య కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 

 చర్యలు తీసుకుంటాం :  సంతోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి 

 ఊక చెట్టు వాగులో పందుల స్థావరాలు  వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అట్టి  స్థావరాలు వెంటనే తొలగిస్తాం. నది పరివాహక ప్రాంతాలు లోని నీటిని కలుషితం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.