calender_icon.png 9 February, 2026 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడియోకాల్ మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్య

09-02-2026 01:35:48 AM

మేడిపల్లి, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ అయ్యప్పస్వామి దేవాలయం సమీపం లో నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి కుమారుడు గంగాధరి అభినవ్ (17) ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని ఓ కార్ల షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నా డు.

ఈ నెల 5న రాత్రి తల్లిదండ్రులు షాపిం గ్ కోసం బయటకు వెళ్లారు. ఆ సమయం లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రేమించిన అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లా డుతూ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి అతని స్నేహితులకు చెప్పడంతో వారు ఇంటికి వెళ్లి డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. అనంతరం అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించా రు. అప్పటికే అతను మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.