26 July, 2026 | 2:15 AM

యువత విజయమే

26-07-2026 12:00 AM

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు

పెద్దపల్లి, జూలై 25 (విజయక్రాంతి): కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర ధాన్ రాజీనామా దేశ యు వత, విద్యార్థులు సాధించిన విజయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ఒక కేంద్ర మంత్రి రాజీనామా మాత్రమే కాదు. హక్కుల కోసం విద్యార్థులు ఐక్యంగా చేసిన పోరాటానికి లభించిన ఫలితం అన్నారు.