దోమకొండలో హైకోర్టు జడ్జిలు
రెండు రోజుల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటన
దోమకొండ, జూలై 25 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవీలత, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండురోజుల అధికారిక పర్యటనలో భాగంగా దోమకొండ మండల కేంద్రంలోని చారిత్రక గడికోటను సందర్శించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జీవీఎన్ భారతలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన న్యాయాధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది న్యాయమూర్తులకు స్వాగతం పలికారు.
రెండు రోజులపాటు కొనసాగే ఈ అధికారిక పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ న్యాయస్థానాలను సందర్శించి, న్యాయ పరిపాలన, కోర్టుల పనితీరు, ప్రజలకు అందుతున్న న్యాయ సేవలపై సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా అవసరమైన సూచనలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఐరన్ నర్సయ్య, ఎంపీడీ వో మధురిమ, ఎమ్మార్వో స్వప్న, ఎస్త్స్ర సుధాకర్, గడిట్రస్ట్ మేనేజర్ బాబ్జి, వార్డుస భ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






