దాతల సహకారం మరువలేనిది
చర్ల, ఆగస్ట్ 16,(విజయక్రాంతి): ఆదివాసీ విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్న దాతల సహకారం మరువలేనిదని వనవాసీ కళ్యాణ ఆశ్రమ్ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు. మండల కేంద్రానికి చెందిన బుక్ స్టాల్ యజమాని స్వర్గీయ చిల్లంచర్ల విశ్వేశ్వరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి అనంతలక్ష్మి, కుమారులు కోటేశ్వరరావు, వెంకటసాయి, కుమార్తె కటకం విజయలక్ష్మి చర్లలోని కొమరం భీం విద్యార్థి నిలయానికి ఆదివారం రెండు క్వింటాళ్ల బియ్యం, విద్యార్థులకు భోజనం, పండ్లను వితరణగా అందజేశారు.
నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆశాలత మాట్లాడుతూ, ఆదివాసీ విద్యార్థుల ఉన్నతికి దాతలు సహాయ సహకారాలు అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. వనవాసీ కళ్యాణ పరిషత్ ఆదివాసీలకు విద్య, వైద్యం అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.మారుమూల గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించడం హర్షణీయమన్నారు.
జన్మదినాలు, శుభ-అశుభ కార్యక్రమాల్లో ఆడంబరాలకు పోయి డబ్బు వృథా చేయకుండా ఆదివాసీ విద్యార్థుల విద్యకు సహకరించడం శుభపరిణామమని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతులు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, సాగర్, సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, తోలెం రామకృష్ణ, పూజారి కాంకేర్ మాజీ సర్పంచ్ మజ్జ శోభారాణి, శబరి బాలికా నిలయ కార్యదర్శి బందా స్వరూపరాణి, నిలయ ప్రముఖులు వరలక్ష్మి, సంతోష్ పాల్గొన్నారు.






