నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు
డి.జైరాం :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లు నిప్పుల కొలిమిగా మా రాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని నిడదవోలు, పిడుగురాళ్ల, తెలంగాణలోని జగిత్యాల, నల్లగొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.5 డిగ్రీల నుంచి 47.8 డిగ్ల్ర వరకు నమోదవుతూ గత రికార్డులను తిరగరాస్తున్నాయి. పగటితో పాటు రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు దాటడం వల్ల మారవాళికి సవాలుగా మారింది. గడిచిన రెండు దశాబ్దాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే సంభావ్యత 25% పెరిగింది.
ఈ ఉష్ణోగ్రతలు భూతాప సంక్షోభానికి స్పష్టమైన సాక్ష్యాలు. మానవ తప్పిదాల వల్ల భూతాప ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. ఎండలు ముద రడానికి పర్యావరణ విధ్వంసం, మానవ తప్పిదాలే ప్రధాన కారణాలు. అలాగే, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో కూడా కారణం. ఎల్‌నినో ప్రభావంతో బం గాళాఖాతం నుంచి రావాల్సిన తేమతో కూ డిన గాలుల ప్రభావం తగ్గి పొడి వాతావరణం ఏర్పడుతున్నది.
వాయువ్య ప్రాంతం నుంచి వస్తున్న తీవ్రమైన వేడి గాలులను ఉన్నత వాతావరణ పీడనం మన ప్రాంతంపైనే నిలిపివేస్తున్నది. దశాబ్దం నుంచి పెరిగిన పట్టణీకరణ వాతావరణంలో వేడిశాతాన్ని పెంచుతున్నది. సూర్యరశ్మి తీవ్రతను పరావర్తనం చేసే గడ్డి భూములు, వ్యవసాయ భూముల స్థానంలో సిమెంట్ భవ నాలు, తారు రోడ్లు రావడంతోనే ఈ పరిస్థితి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం వంటి నగరాలో కాంక్రీట్ జంగిళ్లుగా మారడం ఆందోళకరం.
రోడ్ల విస్తరణ, మై నింగ్ పేరుతో లక్షలాది పాత వృక్షాలు తొలగించబడటంతో పర్యావరణ హరిత కవచం క్షీణిస్తున్నది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్, మిథేన్ వంటి వాయువులు వాతావరణంలో చేరి ఉష్ణాన్ని పెంచుతున్నాయి. ఎండల వేడి తట్టుకోవడానికి వాడుతున్న ఎయిర్ కండిషనర్లు లోపలి భాగాన్ని చల్లబరుస్తూనే, బయట మరింత వేడిని విడుదల చేస్తూ దుష్ర్పభావ చక్రాన్ని సృష్టిస్తున్నాయి.
చెరువులు, కుంటలు మా యమవడం వల్ల బాష్పీభవన ప్రక్రియ బలహీనపడి, వాతావరణాన్ని చల్లబరిచే సహజ చక్రం దెబ్బతింటున్నది. రసాయనాల అధిక వినియోగం వల్ల పొడిబారిన వ్యవసాయ నేలలు సూర్యుడి వేడిని మరింత వేగంగా గ్రహిస్తున్నాయి. భూతాపం వెనుక ఉన్న చారిత్రక బాధ్యతను, ప్రపంచ అభివృద్ధి అసమానతలను పరిశీలించాల్సిన అవసరం ఉం ది. ప్రపంచ జనాభాలో కేవలం స్వల్ప శాతం ఉన్న అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్య వంటి పారిశ్రామిక శక్తులు తమ పారిశ్రామికీకరణ, అధిక వినియోగ జీవనశైలి ద్వారా ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో 60% పైగా వాటాను కలిగి ఉన్నాయి.
పారిశ్రామిక విప్ల వం ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణంలో పేరుకుపోయిన ఉద్గారాల్లో ఈ దేశా ల వాటానే అత్యధికం. పరిశ్రమల లాభాలు ప్రపంచంలోని కొన్ని దేశాలకు చేరితే, వాటి పర్యావరణ మూల్యాన్ని మాత్రం వేరే దేశాల ప్రజలు చెల్లించాల్సి వస్తున్నది. అభివృద్ధి చెం దుతున్న దేశాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కూలీలు అనుభవించా ల్సి వస్తున్నది.
అందుకే వాతావరణ మార్పు కేవలం శాస్త్రీయ సమస్య మాత్రమే కాదు. అది సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వానికి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు కర్బన నియంత్రణ గురించి సూచనలు చేస్తూనే, తాము అందించాల్సిన వాతావరణ నిధులు, సాంకేతిక సహాయంలో వెనుకడుగు వేస్తున్నాయి.
భవిష్యత్తు సవాళ్లు
మనమిప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోపోతే రానున్న పదిహేనేళ్లలో తెలుగు రాష్ట్రా లు తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతున్నాయి. వా తావరణ నవనాల అంచనాల ప్రకారం 2040 నాటికి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల మార్కుకు చేరుకునే ప్రమా దం ఉంది. తీవ్రమైన ఎండలు, భూగర్భ జలాలు క్షీణించడం వల్ల రాయలసీమ, పశ్చి మ తెలంగాణ ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో వలస వెళ్లే అవకాశం ఉంది.
తీవ్రమైన వేడి ప్రభావంతో మానవ శ్రామిక సామర్థ్యం దాదాపు 40% వరకు తగ్గి, ఇది రెండు రాష్ట్రాల ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది. జలాశయా ల్లో బాష్పీభవన వేగం పెరగడం వల్ల తాగునీటి కొరత ఏర్పడి, జిల్లాల మధ్య వివాదా లు తలెత్తవచ్చు. ఏసీలు, కూలర్ల వినియోగం వల్ల విద్యుత్ అవసరాలు అమాంతం పెరిగి, గ్రిడ్‌లపై ఒత్తిడి వల్ల గంటల తరబడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగంలో ప్రధాన పంటల దిగుబడి తగ్గిపోవడం వల్ల ఆహార ధరలు పెరుగుతాయి.
అధిక వేడి కారణంగా వడదెబ్బ, కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఆర్థిక వనరులు ఉన్నవారు వేడి నుంచి ఉపశమనం పొందగలరు కానీ, నేరుగా ఎండ లో పనిచేసే అట్టడుగు వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి. అలాగే అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చులు పెరిగి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. భూతాప సంక్షోభాన్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం భూమి సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల లోపే పరిమితం చేయాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం కూడా 2070 నాటికి శూన్య కర్బన ఉద్గార లక్ష్యం సాధించాలని ప్రకటించింది. కానీ, ఈ నిర్ణయాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలి. ప్రపంచంలోని అనేక దేశాలు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నాయి.
సింగపూర్, జర్మనీ తరహాలో భవనాలపై పచ్చని పైకప్పులు, గోడల పై నిలువు తోటల పెంపకాన్ని ప్రోత్సహించవచ్చు. చైనా అనుసరిస్తున్న ‘స్పాంజ్ సిటీ’ నవనా ద్వారా వర్షపు నీరు భూమిలోకి వెళ్లేలా రోడ్లను రూపొందించవచ్చు. అమెరికాలోని కొన్ని నగరాల్లో అమలు చేస్తున్న వేడిని పరావర్తనం చేసే ప్రత్యేక రహదారి పూత విధానాన్ని ప్రయోగాత్మకంగా వాడొ చ్చు. ఫ్రాన్స్ తరహాలో వేసవి కాలంలో ప్రభుత్వ భవనాలను మధ్యాహ్న సమయా ల్లో ప్రజా శీతల కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చు.
దేశీయంగా చర్యలు
మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను అమలు చేయాలి. మొదట, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో వేడిని పరావర్తనం చేసే పూతలు లేదా కూల్ రూఫ్ విధా నాన్ని తప్పనిసరి చేయాలి. దీనివల్ల లోపలి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల నుంచి 5డిగ్రీల వరకు తగ్గుతాయి. సంప్రదాయ థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించి సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక వనరులపై పెట్టుబడులు పెంచాలి. పూడిన ప్రతి చెరువు, కుం టను గుర్తించి పునరుద్ధరించడం తక్షణ అవసరం.
నగరాల ప్రణాళికలో హరిత జోన్లు తప్పనిసరి చేయాలి. ప్రజా రవాణాను బలోపేతం చేసి వ్యక్తిగత వాహనాల వినియోగా న్ని తగ్గించే విధానాలు కఠినంగా అమలు చేయాలి. ప్రభుత్వాల చర్యలతో పాటు పౌ రుల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యం. ప్రతి వ్యక్తి తన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలి. ప్రతి ఇంట్లో ప్రతిఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కను పెంచి పెద్ద చేయాలి.
ఇంట్లో అవసరం లేని సమయంలో విద్యుత్ వాడకం తగ్గించాలి. వారంలో కనీ సం ఒకరోజు వ్యక్తిగత వాహనాలను పెట్టాలి. ప్రజారవాణాను వినియోగించాలి. నిత్యజీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. వేసవిలో ఇంటి పైకప్పులపై పక్షుల కోసం మట్టి పాత్రల్లో నీటిని ఉంచాలి. ఇలాంటి చిన్న మార్పులే జీవవైవిధ్యాన్ని రక్షించడంలో ఎంతో సహాయపడతాయి. తెలుగు రాష్ట్రాల్లో నమోదవు తున్న ఈ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రకృతి ఇస్తున్న తీవ్రమైన హెచ్చ రికగా భావించాలి.
ప్రకృతిని పూర్తిగా జయించగలమనే మానవ అహంకారానికి ఈ ఎండలు ఒక గట్టి సమాధానం చెబుతున్నా యి. ‘ప్రకృతిని మనం కాపాడితే, ప్రకతి మనల్ని కాపాడుతుంది’ అనే భావన ఇప్పు డు నినాదంగా కాకుండా జీవన అవసరంగా గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు. అది మ న మనుగడకు సంబంధించిన ప్రాథమిక కర్తవ్యం. ఇప్పటికైనా మనం మారకపోతే, రాబోయే తరాలకు ప్రకృతి వైపరీత్యాలను మిగిల్చినవాళ్లమవుతాం.
వ్యాసకర్త మెయిల్: mr.dunga@rediffmail.com






