25 March, 2026 | 2:08 AM

30న మామిడి తోట వేలం పాట

25-03-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 24 (విజయ క్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామ పరిధిలో గల ప్రభుత్వ ఉద్యాన క్షేత్రంలో గల 20 ఎకరాల మామిడి తోట పంటను ఈనెల 30వ తేదీన  వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఇన్చార్జి హెచ్.ఓ.సంతోష్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మామిడి తోట వేలంపాటలో పాల్గొనేవారు ముందస్తు 1000 ధరవస్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.

వేలంపాట నిర్ధారించిన తర్వాత రెండు రోజుల్లో వేలం పాటలో నిర్ధారించిన సొమ్ములో సగం చెల్లించాలని, వారం రోజుల్లో మొత్తం సొమ్ము చెల్లించిన తర్వాత తోటలోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఎలాంటి నష్టం జరిగిన ప్రభుత్వ ఉద్యమ క్షేత్రంకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.

మామిడి తోట కాపు చేసేందుకు నీరును మాత్రమే ఉద్యాన క్షేత్రం అందిస్తుందన్నారు.వేలం పాట నిర్ధారించిన పిమట ఏదైనా కారణాలవల్ల జరిగిన వేలంపాటను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారులకు రద్దు చేయుటకు పూర్తి అధికారం ఉంటుందన్నారు.