calender_icon.png 2 July, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధుల కాలం వచ్చేసింది!

02-07-2025 01:38:24 AM

  1. అప్రమత్తతే ఆరోగ్యానికి రక్ష 

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

మెడికల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో క్యాంపులు, అవగాహన సదస్సులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై1 ( విజ యక్రాంతి): వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కవ ఉంటా యి. గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షం  కురుస్తుండ్రంతో సీజనల్ వ్యాధులు మరింత త్వరగా వ్యాపించే అవకాశాలున్నా యి. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నా రు.

జిల్లా నుండి మూడు నెలల పాటు సీజనల్ వ్యాధులు రవళి అవకాశాలు అత్యధికం గా ఉంటాయి. కలుషిత, నిల్వ నీరు, ఆహారం, అపరిశుభ్రత, దోమలు, ఈగలు కీటకాలు ,పందులు తదితర జంతువుల ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. టైఫాయిడ్, కలరా, చికెన్ గున్యా, మలేరియా, మెదడు  వాపు, డెంగ్యూ ,ఫైలేరియా, జ్వరం, విరోచనాలు ఇలాంటి వ్యాధులు సంక్రమించే అవ కాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఫుట్ పాత్ వెంట విక్రయించే పానీపూరి ,ఫాస్ట్ ఫుడ్ తినడం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.బహిరంగ మల మూత్ర విసర్జన తో కూడా అంటువ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి.వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించకుంటే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

అప్రమత్తమైన ఆరోగ్యశాఖ...

సీజనల్ వ్యాధులు సోకిన బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు 24 గంట లు వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉం టుంది. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 108 సబ్ సెంటర్లు ఉన్నాయి. 5 సిహెచ్‌సి లు ఉన్నాయి. జూలై 31 వరకు స్టాప్ డయోరియా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.గ్రామాలలో ఇంటింటి సర్వే చేపడుతూ ఐదు సంవత్సరాలలో పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలను అంద జేస్తున్నారు.

దీంతోపాటు గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్త నమోనాలను సేకరిస్తున్నారు.దోమల నివారణకు స్ప్రే చేపిస్తున్నారు.వీటితోపాటు టీవీ హెచ్‌ఐవి ఎన్సీడీ పరీక్షలు చేయిస్తున్నారు.మూడు టీములు పర్యటిస్తున్నాయి.

జిల్లాలో 151 హై రిస్క్ గ్రామాలను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ఆ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలను అప్రమత్తం చేస్తుం ది.వర్షాకాలం కావడంతో డెలివరీకి దగ్గరలో ఉన్న గర్భిణీలను సమీప పీహెచ్సీలకు తరలించి పర్యవేక్షణ చేపడుతున్నారు. అధికంగా వర్షాలు కురిస్తే రాకపోకలకు ఇబ్బంది కలిగే గ్రామాలలో ని ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

పరిశుభ్రత పాటించాలి

వర్షాకాలంలో వ్యాధులు అత్యధికంగా సంక్రమించే అవకాశం ఉంటుం ది.ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడంతో పాటు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం.ప్రజలు వర్షాకా లంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

 సీతారాం, జిల్లా వైద్యాధికారి