02-07-2025 01:37:11 AM
అర్హుల జాబితాను మార్చుతున్న కాంగ్రెస్ నాయకులు ?
రామకృష్ణాపూర్ జూలై1: పేదోడి సొం తింటి కల కలగానే మిగులుతోంది. ఇల్లు లేని పేదలకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వగా అప్పటి చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ని రామకృష్ణాపూర్ పట్టణంలోని 1వ వార్డు తారకరామ కాలనీని అనుకోని ఉన్న 10 ఎకరాల స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో286 డబుల్ బెడ్ రూములు ఇళ్లను నిర్మించారు. ఇళ్ల కొరకు సుమారు 17 వందల మంది ఆన్లైన్లో నమోదు చేసుకోగా గత ప్రభుత్వం 302 మందిని అర్హులుగా ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇండ్ల పంపిణీ చేసే కార్యక్రమన్ని నిలిపివేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున చెన్నూర్ నియోజక వర్గంలో గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామి 2025, మే నెలలో డబుల్ బెడ్ రూముల పంపిణీ చేసేందుకు మరల కొత్తగా అర్హుల జాబితాలను ప్రకటించగా కొందరు స్థానిక పట్టణ కాంగ్రెస్ నాయకులు వారి చేతివాటంతో ఆన్లైన్ లో నమోదు చేసుకొని వారి పేర్లను, నాయకులకు నమ్మకంగా ఉన్న ఉన్న వారి పేర్లను ఈ జాబితాల్లో చేర్చరంటూ బిఆర్‌ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ లకు పిర్యాదు చేయగా స్పందించిన అధికారులు అర్హుల జాబితాలను పునఃపరిశీలించారు. 286 మందిని అర్హులుగా ప్రకటించారు.
కాగా 286 ఇండ్ల పంపిణీలో 51 ఇండ్లను పక్కన పెట్టి 235 మాత్రమే పంపిణీ చేస్తున్నామని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇండ్ల పంపిణీ చేసేందు కు రెండు సార్లు అర్హులైన వారి జాబితాలను విడుదల చేసినప్పటికి లబ్ధిదారులకు మాత్రం ఇండ్లను నోచుకోలేదనే చెప్పవచ్చు. దీనితో అర్హులైన వారు తమకు ఇల్లు వస్తా యా, వస్తే అధికార ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందని నాయకులను ప్రశ్నిస్తున్నారు.
లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తాం: - సతీష్, తహశీల్దార్, మందమర్రి
రామకృష్ణాపూర్ పట్టణంలోని నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వారం రోజుల్లో లక్కీ డ్రా ద్వారా ఇండ్లను మంజూరు చేస్తాం. అనర్హులకు ఎట్టి పరిస్థితిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్య లు తీసుకుంటాం.
18 ఏండ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం -
సొంత ఇల్లు లేక గత 18 ఏండ్లుగా పట్టణంలోని స్థానిక శ్రీనివాస నగర్ ఏరియాలో కిరాయి ఇంటిలో ఉంటున్నాము. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు గతంలో ఆన్లైన్ లో నమోదు చేరుకోగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమను అర్హులుగా గుర్తించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తను అర్హులుగా గుర్తించ లేదు. తాము నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్ల కనీసం ఒక సొంత ఇల్లు కలకు కూడా నోచుకోక పోతున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారు తమ పేదరికాన్ని గుర్తించి న్యాయం చేయాలి.
దేవనూరి రాజ్ కుమార్, మందమర్రి
కాంగ్రెస్ లీడర్లకు కేటాయిస్తుండ్రు..
తమ ప్రభు త్వం పట్టణంలో ని ఇల్లు లేని నిరుపేదల కొర కు 286 డబుల్ బెడ్ రూంలను నిర్మించడం జరిగింది. 286 ఇండ్లకు 302 మంది అర్హులుగా గుర్తించినారు. తమ ప్రభుత్వం గుర్తించిన అర్హుల జాబితాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరల కొత్తగా అర్హుల జాబితలను తీసుకు రావడంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చేతివాటం ప్రదర్శించడం వల్ల పేదలకుదక్కాల్సిన డబు ల్ బెడ్ రూంలు వారికి దక్కడం లేదు. కనుక దుర్గ కాలనీ చెందిన పురేళ్ల లక్ష్మీ అనే మహిళ తమకు అధికారులు డబు ల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్న అధికారులు స్పందించక పోవడంపై ఈ నెల 27 మందమర్రి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్ప డింది.
రామిడి కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు