02-02-2026 12:00:00 AM
ఖైరతాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఏడో నిజాం మనవడు నవాబ్ మీర్ నజఫ్ అలీ ఖాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తిమోర్-లెస్టే దేశ రాయబారి కార్లిటో న్యూన్స్ హైదరాబాద్లోని నిమ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నవాబ్ మీర్ నజఫ్ అలీ ఖాన్తో కలిసి విచ్చేసిన రాయబారికి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఘనస్వాగతం పలికారు. అనంతరం వారిని సాదరంగా సత్కరించారు.
పర్యటనలో భాగంగా రాయబారి కార్డియోవాస్కు లర్ అండ్ థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అమరేష్ రావును కలిసి అక్కడి అత్యాధునిక వైద్య సదుపాయాలు, విద్యా సౌకర్యా లను కార్లిటో, నజఫ్ అలీ ఖాన్ పరిశీలించారు. నిమ్స్ అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలు, రోగుల పట్ల వైద్యుల అంకితభావాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. దేశంలోనే అత్యుత్తమ తృతీయ శ్రేణి వైద్య విద్యా సంస్థగా నిమ్స్ నిలుస్తోందని ప్రశంసించారు.