ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే టీఎంయూ లక్ష్యం..
సంఘ రాష్ట్ర కార్యదర్శి థామస్ రెడ్డి
సూర్యాపేట, జూన్ 4 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే టీఎంయూ లక్ష్యం అని సంఘం రాష్ట్ర కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ఆర్టీసీ డిపో టియంయు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా గురువారం స్థానిక సూర్యాపేట పబ్లిక్ స్కూల్ లో జరిగిన సంఘ కార్మికుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. పుల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి జి అంజయ్య, జిల్లా కార్యదర్శి ఎస్. సుధాకర్ గౌడ్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. అనంతరం సూర్యాపేట డిపో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో చైర్మ న్ గా దంతాల కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గరిణే ఏకాంబరము , అధ్యక్షులుగా చింతల రాంబాబు, డిపో కార్యదర్శిగా మాచర్ల లచ్చయ్య, సహాయ కార్యదర్శులుగా డి నాగాచారి, కోశాధికారిగా కక్కిరేణి రాంబాబు, గ్యారేజీ సెక్రటరీగా మల్లయ్య, మహిళ సంయుక్త కార్యదర్శిగా జి సైదమ్మ, ముఖ్య సలహాదారులు యం. వెంకన్న, కె. సుధాకర్, కె. ఆర్ చారిలతో పాటు పూర్తి కమిటీని ఎన్నుకొన్నారు. ఈ సమావేశంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.






