17 March, 2026 | 6:37 PM

ట్రాఫిక్ సమస్యను సత్వరం పరిష్కరించాలి

24-09-2024 02:34 AM

సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): భారీ వర్షాల సమయంలో ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొ ంటున్నారని, వాటికి సత్వర పరిష్కారం చూపాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.  బంజారాహిల్స్‌లోని టీజీసీసీసీ కా ర్యాలయంలో సోమవారం జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎండీఏ, రాచ కొండ, సైబరాబాద్ పోలీస్ అధికారులతో మున్సిపల్ శాఖ ప్రధాన కా ర్యదర్శి  దాన కిశోర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డారు. జీహెచ్‌ఎంసీ సహా పోలీసులు, అధి కారులు దీనిలో భాగస్వాములు కా వాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు తెలియజేస్తే బాగుంటుందన్నారు.