18-04-2025 01:26:07 AM
అవగాహన కార్యక్రమంలో కిమ్స్ వైద్యులు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాం తి): చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ, మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య పార్కిన్సన్స్ డిసీజ్. ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్) సాయంతో కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రి వైద్య చెపుతున్నారు.
సుమారు 150 మంది పార్కిన్స న్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు గురువారం కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మా నస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్‌మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యం లో అవగాహన కల్పించారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. పార్కిన్సన్స్ బాధితులకు చిన్న కోత కూడా లేకుండా ఎంఆర్‌ఐ యంత్రానికి మరో ఫోక స్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తామన్నా రు.
డీబీఎస్ శస్త్రచికిత్సలకు ఎంత ఖర్చు అయ్యేదో, దీనికి కూడా అంతే ఖర్చువుతుందన్నారు. కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ.. ఎంఆర్జీ ఎఫ్యూఎస్ చికిత్సతో ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు సత్ప ఫలి తాలు సాధించామన్నారు. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవ లు అందిస్తోందని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డా క్టర్ భాస్కరరావు తెలిపారు.
చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు తదితరులు మాట్లాడారు.