18-04-2025 01:25:02 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కార్యక్రమంలో భాగంగా 13 లక్షలతో నిర్మించిన బస్తి దవాఖాన ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరయ్యాయని, జగిత్యాల మెడికల్ కాలేజీ,నర్సింగ్ కళాశాల,క్రిటికల్ కేర్ యూనిట్ ఇలా అన్ని విధాలుగా వైద్య రంగంలో అభివృద్ధి సాధించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల జాప్యం వల్ల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో జగిత్యాల లో పేద ప్రజలకు 4520 డబల్ బెడ్ రూం ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాక కాంట్రాక్టర్ లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉండేదని, అప్పటి బాకాయి బిల్లులు నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరు చేస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వం హయం లో ప్రెస్ క్లబ్ భవనం నిధులు మంజూరు చేయగా భవనం పూర్తి అయ్యింది అయినా బిల్లులు రాక చాలా ఇబ్బంది జరిగిందని ఆ కాంట్రాక్టర్ కు ప్రస్తుత ప్రభుత్వంలో బిల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
వ్యక్తి గతంగా విమర్శించడం వల్ల తనకు నష్టం కాదని,తన జీవితం తెరచిన పుస్తకం అని అన్నారు. జగిత్యాల పట్టణం లో 18వేల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు,నూతన ఉద్యోగాలు,రుణ మాఫీ,ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ప్రజల డబ్బు ప్రజలకు అందించడమే ప్రజా ప్రతినిధుల బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ ప్రమోద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాలా జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భారతి రాజయ్య,చుక్క నవీన్, మాజీ ఎంపిటిసి తురగ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ నరసయ్య, మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య,వార్డు నాయకులు ఎల్ జీ రమేష్,గోపి,తదితరులు పాల్గొన్నారు.