calender_icon.png 10 May, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవి అటవీ భూములు కావు

18-04-2025 01:26:32 AM

  1. మా భూములు మాకే ఇప్పించండి..
  2. ప్రభుత్వానికి ముప్పారం గ్రామ రైతుల వేడుకోలు

హనుమకొండ, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి):  ప్రెస్ క్లబ్ లో పట్టా పాస్ పుస్తకాలను చూపుతున్న ముప్పారం గ్రామ రైతులు సందీప్ రెడ్డి, శోభారాణి, మల్లయ్య, యాదగిరి, తదితరులు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ శివారులో తాము సాగుచేసుకుంటున్న భూములు అటవీ భూములు కావని మా భూములను మాకే చెందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ముప్పారం గ్రామ రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గురువారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పారం గ్రామ రైతులు వి. సందీప్ రెడ్డి, ఏ. శోభారాణి, ఏ. మల్లయ్య, రాములు, యాదగిరి, లక్ష్మీ, కనక లక్ష్మీ, పి. నారాయణ తదితర రైతులు మాట్లాడారు. ముప్పారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 842, 846, 847 లలో గల సుమారు 59 ఎకరాల భూమి తమ వారసత్వంగా సక్రమించిందని అన్నారు.

మరి కొంతమంది ఇదే సర్వే నెంబర్లలోని భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వారసత్వంగా వచ్చిన భూములను తమకే చెందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏం రాజిరెడ్డి, కాగితోజు కళావతి, శ్యామల, మహేందర్రెడ్డి, నీరజాదేవి రైతులు పాల్గొన్నారు.