07-05-2025 07:14:43 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా కటకం అశోక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్(District Fertilizer and Pesticides Association) ఓ ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ నూతన కార్యవర్గాన్ని బుధవారం నాడు జిల్లా కేంద్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండలం బెంగుళూరు గ్రామానికి చెందిన కటకం అశోక్ ను జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇతడు కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షునిగా విధులు నిర్వహించి మహాదేవపూర్ మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాపు నిర్వహిస్తున్నాడు. జిల్లా అధ్యక్ష పదవి అశోక్ కు రావడం పట్ల కాటారం డివిజన్ పరిధిలోని ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహకులు హర్షం వెలిబుచ్చుతూ శుభాకాంక్షలు తెలిపారు.