10 July, 2026 | 2:52 AM

ప్రశ్న రావణ్‌పై పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి

10-07-2026 01:18 AM

పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు

ముషీరాబాద్, జూలై 9 (విజయక్రాంతి):ప్రశ్నా రావ ణ్‌పై పెట్టిన ఉపా కేసును, కెవిఆర్, అతని భార్యపై పెట్టి న అన్ని అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పౌ ర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్య క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మ ణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ  ప్రజాస్వామిక వ్యవస్థలో బలమైన నాలుగు వ్యవస్థలున్న నేపథ్యంలో మూడు వ్యవస్థలు దిగజారిపోయని,  ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నాయన్నారు. నాలుగవ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ కనీసంగానైనా సోషల్ మీడియా పరంగా యూట్యూబ్లతో ప్రజల విశ్వాసంలో ఉన్నదన్నారు.

గతంలో చేగువేరతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ తేలాడో మనందరికి తెలుసు. అతని మాటలకు, ఆచరణకు చాలా వ్యత్యాసం కనబడిందన్నారు. చివరికి తాను మాట్లాడిన అప్రజాస్వామిక పదజాలాన్ని ప్రశ్నా రావణ్ అనుకరించడం నాలుగు పోలీస్ స్టేషన్లలో బెయిల్ తో విడుదలైన తరువాత ఐదవ పోలీస్ స్టేషన్లో అప్రజాస్వామిక నిర్బంధ చట్టమైన ఉపా చట్టంతో అతనిని నిర్బందానికి గురి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ య్యూట్యూబ్ ఛానెల్ల పట్ల పత్రికల పట్ల ప్రజాస్వామ్యబద్ధమైన వైఖరితో తమ పాలన కొనసాగించాలన్నారు.

కనిపించకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్న అన్ని పత్రికలపై య్యూట్యూబ్లపై ఆ నిర్బంధాన్ని ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడగలిగితేనే  ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. లేకపోతే నిర్బంధమే రాజ్యమేలుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుందన్నారు. పత్రికలపై య్యూట్యూబ్ ఛానెళ్ళపై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులను భేషరతుగా  ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వాలను పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నదన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా ప్రతినిధి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.