10 July, 2026 | 2:22 AM

మల్లికార్జున్ జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. బానుక ఫ్యామిలీ హెచ్చరిక

10-07-2026 01:20 AM

సికింద్రాబాద్, జూలై 9 (విజయక్రాంతి): మిస్టర్ రామకృష్ణ, జ్యోతి స్వరూప్ కు స్క్రిప్ట్ రాసి ఇచ్చి మల్లికార్జున్ పై ఆరోపణ చేయడం తగదు అన్ని బాలిక ఫ్యామిలీ సభ్యులు హెచ్చరించారు.గత మూడు రోజుల క్రితం బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ పై బానుక స్వరూప్ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై జ్యోతి స్వరూప్ తండ్రి బానుక శివానందం మాట్లాడుతూ నా కుమారుడు జ్యోతి స్వరూప్ పైన ఐదు కేసులలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది.స్వరూప్ కు మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహాయం చేయడం ఏమిటి అన్ని ప్రశ్నించారు.రామకృష్ణ కు బానుక కుటుంబ సభ్యులతో ఏమి సంబంధం  అన్ని ప్రశ్నించారు.

రామకృష్ణ ఎన్ని మోసాలు చేసాడో అందరికి తెలుసునని తెలియజేశారు. ఈ సందర్భంగా బానుక సుభాష్  మాట్లాడుతూ ప్రస్తుత నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా ప్రజా సేవ చేస్తున్నారని అన్నారు.మాజీ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ బానుక కుటుంబం పై బురద జల్లాడం మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. ఇదే రామకృష్ణ కు చివరి హెచ్చరిక అన్ని తెలియజేస్తూ ఇక రామకృష్ణ వెంట పడతామని అన్నారు.

అనంతరం బానుక శ్రవణ్ మాట్లాడుతూ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇతర బిజెపి ఎంపీ ల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఫ్లెక్సీ లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే  కేపీ హెచ్ బి పోలీస్ స్టేషన్ లో రామకృష్ణ పై ఏ1 గా కేసు నమోదు అయ్యింది అన్ని తెలియజేస్తూ రామకృష్ణను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసారని దీనిపై రామకృష్ణ ప్రజలకు సమాధానం చెప్పాలని బానుక శ్రవణ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బానుక నాగరాజ్,బానుక సాహిత్, బానుక గణేష్ తదితరులు పాల్గొన్నారు.