calender_icon.png 13 May, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారని కల్తీ కల్లు మాఫీయా!

13-05-2025 12:41:19 AM

  1. ఆగని కల్లు మూస్తే దారుల ఆగడాలు
  2. వాల్ పోస్టర్లు వేసి చేతులు దులుపుకున్న ఎక్సైజ్ అధికారులు
  3. ఉమ్మడి జిల్లాలో యా దేచ్ఛగా కల్తీ కల్లు దందా

కామారెడ్డి, మే 12 (విజయక్రాంతి): మేము మారం అంతే...!  కల్తీ కల్లు దందా చేయకుంటే తాము పెట్టిన పెట్టుబడులు రావు, నిబంధన లు మాకు పట్టవు. పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఎక్సైజ్ అధికారులు మరోవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు మరోవైపు కల్లుమూస్తే దారులకు కల్తీ కల్లు అమ్మకాలు చేపట్టవద్దని పదే పదే అవగాహన సదస్సులు వాల్పోస్టర్లతో గ్రామ గ్రామాన చైతన్యం కలిగిస్తుండగా కల్లు ముస్తేదారులు మాత్రం తమకేమి పట్టదని నిత్యం లక్షల లీటర్ల కల్తీకల్లును పేద ప్రజలకు అమ్ముతున్నారు.

ప్రభుత్వం కల్తీ కల్లు, డ్రగ్స్, గంజాయి, వంటి మత్తు పదార్థాలను నిషేధించేందుకు మరోవైపు ప్రయత్నం చేస్తుంటే, కల్తీ క ల్లు మాఫి య మాత్రం తమకేమీ పట్టనట్లుగా గ్రామ గ్రామాన జోరుగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా లోని పలు మండలాల్లో కల్తీ కల్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.

నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఇలాంటి ఆగడాల ను అరికట్టేందుకు మరోవైపు ప్రయత్నం చేస్తున్న కల్లుమూస్తే దారులు మాత్రం తమ కల్తీ కల్లు అమ్మ కాలు మాత్రం కామారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు అమ్మకాల జోరు కొనసాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్తీ కల్లు తొలగించాలని చాలా సందర్భాల్లో తెలియజేశారు. కానీ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా  మొదటి స్థానంలో కల్తీకల్లు విక్రయాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కల్లు డిపోలు అక్రమ కల్లు దుకాణాలు కామారెడ్డి ఉమ్మడిజిల్లా లోనే ఉండడం గమనార్హం.

బడా బాబులు రాజకీయ నాయకుల అండదండలే కారణం

ఆయా మండలాల్లో కొందరు బడాబాబులు సిండికేట్‌గా ఏర్పడి కల్లు ముస్తేదారు లుగా అవతారం ఎత్తి ప్రాంతాల వారిగా ప్రాంతాన్ని బట్టి మధ్యతరగతి ప్రజలకు కల్తీ కల్లుఅంటగట్టి సొమ్ము చేసుకుంటున్నా రూ.  గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతో పాటు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో సాఫీగా సాగిన అక్రమ కల్తీకల్లు మాఫియా వ్యవస్థ ప్రస్తుతం లో కూడా కొత్త రూపు దాల్చింది.

ఇంకేముంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఆయా మండలాల్లో యదేచ్చగా కల్తీ కల్లు విక్రయాల షాపుల సంఖ్య మరింతగా పెరిగింది. అనుమతులు లేకుండానే కల్తీ కళ్ళు విక్రయాలు ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు ఎక్సైజ్ , పోలీస్ అధికారులకు నెలసరి మామూలు ముట్టజెప్పి తమ గ్రంధాను కోన సాగిస్తున్నారు. కల్లుమూస్తే దారులలోమార్పు ఏమి కనిపించడం లేదు.

ఈ సిండికేట్ ముఠా టార్గెట్ చేసుకొని చిన్న పిల్లలు సైతం ,ఆడవారికి సైతం విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. 18 సంవత్సరాలు లోపు యువకులకు కల్లు  విక్రయించబడదంటూనే అక్రమ కల్తీకల్లు షాపుల ద్వారా అక్రమ అమ్మకాలు జరుపుతుండడం విశేషం.

 కల్తీ కల్లు అమ్మకాలు జోరు

కామారెడ్డి జిల్లా లోని మండల కేంద్రాల తో పాటు గ్రామాలలో కూడా కనీసం కూరగాయల దుకాణం మొదలుకొని బట్టల షాపుల వరకు నిత్యవసర సరుకులు అమ్మినట్లు ఆయా గ్రామాలు, మండలాల్లో ఈ కల్తీకల్లుని అమ్ముతుంటారు. రోడ్ల వెంబడి ఫీవర్ కల్లు 200 నుంచి 500 వరకు కళ్ళు లొట్టిల పేరుతోవిరివిగా లభించే ఈ అక్రమ కల్తీ కల్లు విక్రయిస్తున్నారు.

షాపుల ద్వారా ఈ కల్తీ కల్లు ద్వారానే ముఖం కడుక్కోవడం, పని పాటలు మాని అనేక కుటుంబాలు ఆర్థిక భారంతో రోడ్డున పడుతున్న సంఘటనలు ఆయా మండలాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. కల్తీ కల్లుకు బానిసై విద్య మానేసి, తమ ఆరోగ్యాలను చక్కటి భవిష్యత్తును తెలిసి తెలియక  చిద్రం చేసుకుంటున్నారు.

అధికారులకు పట్టించేది...?

నేటి బాలలే రేపటి పౌరులు అనే కంటే నేటి బాలలే రేపటి కల్తీ కల్లు ప్రియు లు అన్న విధంగా మన తెలంగాణ రాష్ట్రం మా రక ముందే చోద్యం చూస్తున్న అధికారులకు తమ విధులు బాధ్యతను విధిగా గుర్తుచేసే చేస్తే సరి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు బలహీనపడి పైన సందర్భాల్లో గత ప్రభుత్వ కాలంలో చూశాం కానీ ఇప్పటి ప్రభుత్వ కాలంలో ఇలాంటి విధానాలకు తావియ్యకుండా అధికారులను మేల్కొల్పడమే తమ బాధ్యతలను గుర్తు చేయడమే చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

పట్టింపు లేని అధికారుల కారణంగా కల్తీకల్లు ప్రియుల జేబులు ఖాళీ కావడమే గాక వారి కుటుంబాలు రోడ్డున పడవడమే కాక చిన్నపిల్లలు ఆడవాళ్లు అని తేడా లేకుండా ఆయా మండలాల్లోనే ప్రజలు వారు బ్రతుకులు చిద్రమవుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ అక్రమ కల్తీకల్లు షాపుల ద్వారా విరివిగా లభించే ఈ కల్తీ కల్లు మాఫియా దాహానికి చాటుమాటున ఆడవాళ్లు కూడా కల్తీకల్లుకు బానిసలు ఐ సంసారాలు వీడి బాధ్యతలు మరుస్తున్న సందర్భాలు మనకు కళ్ళముందు ఎన్నో ఎదురవుతూనే ఉన్నాయి.

కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ ,బిచ్కుంద ,ఎల్లారెడ్డి కామారెడ్డి, నియోజకవర్గాలలోనీ పలు మండలాల్లో ప్రజలు ఈ విధమైన కల్తీ కల్లు మాఫియా దాహానికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. బాన్సువాడ డివిజన్ లో కల్తీ కళ్ళు సేవించి 90 మంది పైగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే, కామారెడ్డి జిల్లాలో వంద మందికి పైగా కల్తీకల్లుతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది.

ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి సైతం కామారెడ్డి జిల్లా కల్తీకల్లు పై సమీక్ష నిర్వహించడం విధితమే. సీఎం కల్తీకల్లు విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచినప్పటికీ కల్తీ కళ్ళు మాఫియా లో మాత్రం ఎలాంటి మార్పు చేర్పులు కనబడడం లేదు గ్రామాల్లో సూర్యాస్తయం అనంతరం అనుమతులు లేని అక్రమ కల్తీకల్లు విక్రయ దుకాణాల ద్వారా కల్తీ కల్లు ఏరులై  పారుతోంది.

కల్తీ కళ్ళు అనుమతులు లేని షాపుల ద్వారా ఉదయం అమ్మకుండా సాయంత్రం అధికారుల అండదండతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు, అనుమతులు లేని షాపులు గుర్తించినప్పటికిని కల్తీకల్లు విక్రయాలు ఆపలేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. అనుమతులు ఉన్న షాపులలో ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

అనుమతులు లేని దుకాణాల ద్వారా కల్తీకలను సాయంత్రం సూర్యాస్తమయం  తర్వాత యదేచ్చగా విచ్చలవిడిగా కొనసాగుతున్నారు. అనుమతులు లేకుండా కల్లు విక్రయ దుకాణాలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరడంలో అధికారుల పాత్ర కీలకం అని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు.  

 సెలవుల్లో ఎక్సైజ్ అధికారులు 

కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు పలువురు సెలవులు పెట్టి వెళ్లారు. కల్తీ కల్లు విక్రయాలు అరికట్టాల్సిన అధికారులు ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రభుత్వం ఒకవైపు ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ అధికారులు పెడచెవిన పెట్టారు. కేవలం కళ్ళు దుకాణాలలో వాల్ పోస్టర్లు అంటించి చేతులు దులుపుకున్నారు.

కల్తీ కల్లు అమ్మకాలు చేస్తే కేసులు 

కల్తీ కల్లు అమ్మకాలు చేపడితే కేసులు నమోదు మే కాకుండా ఆల్ఫాజూలం వంటి మత్తు పదార్థాలు కల్తీకల్లులో కలిపి అమ్మకాలు చేపడితే వారికి కఠినంగా శిక్షలు ఉంటాయని ముందుగానే ముస్తేదారులకు కల్లు గీత కార్మికులకు ఎక్సైజ్ అధికారులు అవగాహన కల్పించామని చెప్తున్నారు. కల్తీ కల్లు విక్రయాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా ఉమ్మడి జిల్లాలో ఇదే కల్తీ క ల్లు దంద కొనసాగిస్తున్నారు.