13-05-2025 12:40:39 AM
ఇద్దరు యువకుల అరెస్టు
కుత్బుల్లాపూర్, మే 12(విజయక్రాంతి): పార్టీ చేసుకుం దాం ఇంటికి రా అని పిలిచి యువకులు ఓ అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం ఝార్ఖండ్ కు చెందిన ఓ యువతి చెన్నై లోని ఓ యూనివర్సిటీ లో బయో మెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతుంది.హైదరాబాద్ బాచుపల్లి కి చెందిన అజయ్ చెన్నై లోని అదే యూనివర్సిటీ లో బీటెక్ చదువుతున్నాడు.ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుతుండడంతో ఫ్రెండ్స్ అయ్యారు.
బ యో మెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సదరు యువతి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఇంటర్నల్షిప్ చేసేందుకు మే 3 న నగరానికి వచ్చింది. అయితే తనకు హైదరాబాద్ లో ఎవ్వరూ తెలియకపోవడంతో తనకు హాస్టల్ లో ఓ రూమ్ చూసిపెట్టాలని తన ఫ్రెండ్ అజయ్‌ను కోరింది. అజయ్ కేపీహెచ్‌బీ కాలనీ లో గల ఉమెన్స్ హాస్టల్ లో అద్దెకు రూమ్ చూసి తనను రైల్వే స్టేషన్ లో పికప్ చేసుకుని హాస్టల్ కు తీసుకువెళ్ళాడు.
అనంతరం పథకం ప్రకారం హైదరాబాద్ కు వ చ్చిన సందర్భంగా చిన్న పార్టీ చేసుకుందాం మా ఇంటికి వే ళ్దాం వస్తావా అంటూ అమ్మాయిని కోరడంతో అమ్మాయి స రే అంటూ అజయ్ తో బయలు దేరింది. అయితే అంతకు ముందే అజయ్ తన ఫ్రెండ్ హరి కీ అమ్మాయి వస్తున్న విష యం చెప్పి ఒక రూము కావాలని కోరాడు. అందుకు హరి ని జాంపేట్ రాజీవ్ గృహకల్ప లో తాను అద్దెకు తీసుకున్న రూమ్ ఉందని అక్కడకు వెళ్దాం అని తెలిపాడు.
హాస్టల్ నుండి అమ్మాయితో వచ్చిన అజయ్ తన ఫ్రెండ్ హరిని ఆ అమ్మాయికి పరిచయం చేశాడు.రూముకు వెళ్లేముందు ముగ్గురు కలి సి ప్రగతి నగర్ లోని ఓ వైన్ షాప్ లో వోడ్కా తీసుకుని రాజీ వ్ గృహకల్ప లోని రూముకు వెళ్లి అదే రోజు అర్ద రాత్రి ము గ్గురు కలిసి ఫుల్లుగా తాగారు.అమ్మాయి మత్తులో ఉండగానే హరిని బయటికీ పంపి అజయ్ ఆ అమ్మాయితో శారీరకంగా కలిశాడు.
ఆ తర్వాత అజయ్ ప్లాన్ ప్రకారం బయటికీ వెళ్లగా మత్తులో ఉన్న సదరు యువతి పై హరి బలవంతం గా రేప్ చేశాడు. మత్తులో నుంచి కోలుకున్న యువతి తనపై హరి అత్యాచారం చేస్తున్న విషయం గమనించి గట్టిగా అరిచింది.దీంతో విషయం రాజీవ్ గృహకల్ప బ్లాక్ లో నివాసం ఉంటున్న ప్రజలకు తెలియడం తో ముగ్గురిని పట్టుకుని బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాచుపల్లి ఎస్ హెచ్ ఓ ఉపేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అబ్బాయిలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అమ్మాయికీ వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి అమ్మాయిని స్వంత రాష్ట్రానికి పంపించారు. భాదితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అజయ్, హరి ని రిమాండ్ కు తరలించారు.