13-05-2025 12:42:16 AM
యాదాద్రి భువనగిరి మే 12 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ కుటుంబ సమేతంగా సోమవారం నాడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, న్యాయమూర్తికి సాదరంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు ఆధ్వర్యంలో స్వామివారి స్వయంభువ విశిష్టతను వివరించి ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు .