calender_icon.png 3 February, 2026 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్ తెలంగాణకు వరం!

03-02-2026 12:23:10 AM

  1. విమర్శలు మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలి 
  2. రాష్ట్రంలో పరిపాలనా నిర్లక్ష్యం, అమలు వైఫల్యం, నాయకత్వ అసమర్థతే అసలు సమస్య
  3. కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హితవు 

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ 2026-- తెలంగాణ రాష్ట్రానికి ఒక చారిత్రక వరమని, ఇప్పటికే తెలంగాణలో 35 శాతానికి పైగా పట్టణ జనాభా ఉండగా, విస్తరించిన జీహెచ్‌ఎంసీ పరిధితో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగర సమూహాల్లో ఒకటిగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ తెచ్చిన అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమవుతోందని బీజేపీ మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె వరకు మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం ద్వారా తెలంగాణను జాతీయ లాజిస్టిక్స్, మొబిలిటీ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగు వేశారని పేర్కొన్నారు. ఇది దక్షిణ భారత వ్యాపారం, పర్యాటకం, పరిశ్రమల అనుసంధానానికి గేమ్‌చేంజర్‌గా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనియన్ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.12.12 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్‌ను ప్రకటించిందన్నారు.

దీని ద్వారా తెలంగాణలోని రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్--2, ఎంఎంటీఎస్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు వేల కోట్ల నిధులను తీసుకురావచ్చని తెలిపారు. వీబీజీ రామ్‌జీ గ్రామీణ ఉపాధి ఆస్తుల నిర్మాణ పథకం కింద రూ.2,95,000 కోట్లు కేటాయించిందని, ఇందులో నుంచి తెలంగాణకు కనీసం రూ.5,000 కోట్లు దక్కుతుందని పేర్కొన్నారు.

అదనంగా బయో--ఫార్మా పరిశోధన నిధులు, పునరుత్పాదక ఇంధన పథకాలు, అర్బన్ డెవలప్మెంట్ రిస్క్ ఫండ్స్, అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయవచ్చని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరాలతో పోలిస్తే తెలంగాణకు 13.5 శాతం అధిక నిధుల కేటాయించిందని, ఇది మోదీ ప్రభు త్వం తెలంగాణ అభివద్ధిపై ఉన్న నిబద్ధతకు స్పష్టమైన సాక్ష్యమని తెలిపారు.

తెలంగాణకు సమస్య నిధుల లేమి కాదు -... ప్రభు త్వంలోని పరిపాలనా నిర్లక్ష్యం, అమలు వైఫ ల్యం, కాంగ్రెస్ నాయకత్వ అసమర్థతే అసలు కారణమని విమర్శించారు. కాంగ్రెస్ మం త్రులకు సామర్థ్యం లేకపోతే, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు సహకరించ డానికి సిద్ధంగా ఉన్నారని, తాను 2014-- మధ్య టీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్నప్ప టికీ, ప్రతిపక్షంలో ఉండగానే ఐఐఐఎంఎస్, కేంద్రీయ విద్యాలయం,

ఎంఎంటీఎస్ విస్తరణ, గోవైల్లీ మధ్య ఎన్‌హె చ్ వంటి కీలక ప్రాజెక్టులను తీసుకురాగలిగాని వెల్లడించారు. ఇలా మోదీ ప్రభుత్వం రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా, నిజమైన అభివృద్ధి అవసరాలకు స్పందించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వం విమర్శలు మానేసి, యూనియన్ బడ్జెట్ తెచ్చిన అపార అవకాశాల అమలుపై దృష్టి పెట్టాలని బూర నర్స య్య గౌడ్ సూచించారు.