calender_icon.png 3 February, 2026 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ రాక అంతా ఆగమాగం

03-02-2026 12:50:40 AM

ఆసరా పెన్షన్ డబ్బుల కోసం పేదల పరేషాన్

ఎదురు చూపుల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు

జైనూర్/ఉట్నూర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): పేదలకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల అందించే ఆసరా పెన్షన్ పథకం డబ్బులు రాక జిల్లాలో అంత ఆగమా గం అవున్నారు. పెన్షన్ డబ్బులు లేక వృద్ధు లు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పరేషాన్ లో ఉన్నారు. ప్రతి నెల పంపిణీ చేసే పెన్షన్ డబ్బులు కోసం పెన్షన్ దారులు వేయి కళ్ళ తో ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు మొత్తం 72, 745 మం ది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతనెల 22వ తేదీన 17 కోట్ల 24 లక్షల రూపాయలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని సర్ఫ్ ద్వారా పోస్ట్ ఆఫీస్‌లకు విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్ డబ్బులను తపాల శాఖ అధికారులు బ్యాంకు నుండి తీసుకున్నందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తపాల శాఖ అధికా రులు సైతం బ్యాంక్ అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని, దీంతో పింఛన్దారులకు సమయానికి తాము పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. 

అలాగే ఆసరా పింఛన్ పేదల జీవనాధారం. కానీ జనవరి నెల ముగిసి ఫిబ్రవరి ప్రారంభమైనప్ప టికీ జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో వేలాది మంది లబ్ధిదారులకు ఇప్పటికీ జనవరి నెల పింఛన్ అందలేదు. బ్యాంకుల్లో నగదు కొరతతో పాటు పంపిణీ ప్రక్రియలో జాప్యం కారణంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి నెల 26వ తేదీ లోపు తపాలా శాఖ ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఆసరా పింఛన్ పంపిణీ పూర్తవుతుంది. అయితే ఈసారి గడు వు దాటిపోయినా నగదు అందకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. 

ఈ విషయంపై డి.ఆర్.డి.ఓ కార్యాలయంలోని డీపీఎం జాదవ్ శేషారావు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పెన్షన్ డబ్బులను  తపాల శాఖకు ఈనెల 22న జమ చేశామని అన్నారు. ప్రతినెల సమయానికి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తపాల శాఖ అధికారులు ఆదేశించిన వారు పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్ పంపిణీపై తపాల శాఖ అధికారులతో మాట్లాడితే.. బ్యాంక్ అధికారు లు డబ్బులు ఇవ్వడం లేదని చెబుతున్నారని ఆయన తెలిపారు. 

అలాగే  ఏజెన్సీ ప్రాంతాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో మొ త్తం 7,532 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారు లు ఉన్నారు. పింఛన్ డబ్బుల విషయమై సం బంధిత అధికారి ఎస్పీఎంను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పెన్షనర్లకు డబ్బులు చెల్లించలేకపోతున్నామ ని, పింఛన్ పంపిణీకి ఒక కోటి నుంచి ఒక కోటి 50 లక్షల రూపాయల వరకు నగదు అవసరమవుతుందని వెల్లడించారు.

డబ్బులు అందక ఇబ్బందులు

ప్రతినెల 25 నుంచి 30 తారీకు మధ్య తపాలా కార్యాలయానికి వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకునే దానిని. కానీ ఈసారి జనవరి నెల పింఛన్ ఇప్పటికీ అందలేదు. నిత్యావసర సరుకులు, మందులు కొనడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.

 ముండే సుశీల బాయి, జామిని