04-02-2026 12:58:45 AM
రాజేంద్రనగర్ ఫిబ్రవరి 3, (విజయక్రాంతి ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికి ప్రజా వ్యతిరేక బడ్జెటేనని సీఐటీయూ రంగారెడ్డి అధ్యక్షుడు జే రుద్రకుమార్, కార్యదర్శి ఎం చంద్రమోహన్ లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కాటేదాన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గత బడ్జెట్ కంటే సుమారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అదనంగా కేటాయించినా జిడిపి లోటు ఉం దని, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు. ఈ బడ్జెట్ పేదలు, వ్యవసాయ కూలీలు ఇతర సామాజిక గ్రామీణ ఉపాధి కార్మికులు విద్య వంటి రంగాలకు గండికోట్టి రైతులకు గిట్టుబాటు ధరకు గ్యారెంటీ లేకుండా వ్యవసాయ పరికరాలపై జిఎస్టి తగ్గించకపోవడం విచారకరమన్నారు.
ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంపన్నులకు లాభాలు చేకూర్చే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బజ్జలకూర స్వామి. చుక్క మోహన్. పిసికే భాస్కర్. రంగారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరహరి, అ ధ్యక్షులు రాములు. కార్మికులు నరేష్. బాలరాజ్. ఇమ్రాన్. జాంగి. లక్ష్మారెడ్డి. తోఫిక్. టి వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు