కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
- వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
- రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, కాంగ్రెస్ నాయకుల నిరసన
తుంగతుర్తి, జూలై 22 : ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి శాసనసభ్యులు మం దుల సామెల్ ఆదేశాల మేరకు తుంగతుర్తి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మం డల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బుధవారం శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష గొంతును అణచివేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తుపాకులు ఎక్కుపెట్టి తూట్లు పొడుస్తూ ఖూనీ చేస్తున్న మోదీ వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డి మాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, యువత, రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. అలాగే 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గంగరాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బికోజి, కేశవాపురం సర్పంచ్ మిట్ట గడుపుల శ్రీను, నాయకులు నల్లు రామచంద్రారెడ్డి,దాసరి శ్రీను, మాచర్ల అనిల్, కొండ రాజు, పెద్దబోయిన అజయ్, అబ్దుల్,గుగులోతు భాస్కర్, సతీష్ యాదవ్, గుగులోతు రవీందర్, సంజీవ, వెంకటేష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






