23 July, 2026 | 1:49 AM

విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం

23-07-2026 12:00 AM
  1. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం 
  2. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ 

ములుగు, జులై 22 (విజయ క్రాంతి) ఎ న్నో ఆశలతో.. భవిష్యత్తు పై ఊహలతో బం గారు బాట వేసేందుకు విద్యార్థులు పడుతు న్న శ్రమను దోచుకునే ద్రోహులకు కఠిన శిక్ష పడేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్ అన్నారు.

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ ములుగులో కాంగ్రెస్ శాంతియుత నిరసన ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని, అలాగే విద్యార్థులకు సం ఘీభావం తెలిపేందుకు వెళ్లిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ని రసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. అలాంటి విద్యార్థులపై బలప్రయోగం చేయడం, వారిని అణిచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల గొంతును అణచివేయడం, ప్రశ్నించే వారిపై పోలీసు బలాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు.

దేశ యువత, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, నిరసనలను అణచివేయడం ద్వారా ప్రజల స్వరాన్ని ఎప్పటికీ మూయలేరని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు అమానుషం 

భూపాలపల్లి జులై 22 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో శాంతియుత నిరసన కార్యక్రమ నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇంచార్జి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, టీపిసీసీ కో ఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, టీపిసీసీ వరంగల్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ నాసర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు నిరంతరం ప్రజల తరుపున పోరాడుతున్న నాయకుడని అన్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదల ఇబ్బందులు, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తు వంటి ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రాజకీయ కక్షసాధింపుతో ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బెదిరింపులకు భయపడదని, ఒక రాహుల్ గాంధీని అరెస్టు చేస్తే లక్షలాది మంది రాహుల్ గాంధీలు పుట్టుకొస్తారని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని, రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో జరుగుతున్న చర్యలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతారని అన్నారు. వెంటనే రాహుల్ గాంధీపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.