కేంద్ర విద్యామంత్రి వెంటనే రాజీనామా చేయాలి
శంకర్ పల్లి: జూలై 23 (విజయక్రాంతి): నీట్ పేపరు లీకేజీ చేసిన వారి పట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని... విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంకను అరెస్టుకు నిరసిస్తూ చ కాంగ్రెస్ నేతలు నిరసన కు దిగారు. గురువారం శంకర్ పల్లి ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన, రోడ్డుపై బైఠాయించి ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిని రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేయడం అన్యాయం అన్నారు.
విభిన్న అభిప్రాయాల ను, అణిచివేసే ధోరణి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని అన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకలను అణిచివేయ డం అన్యాయమని అన్నారు. దేశంలో జరిగే నీట్ పరీక్ష పత్రాలను లీక్ చేసి విద్యార్థుల భ విష్యత్తులను ఎన్డీఏ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో ము న్సిపల్ చైర్‌పర్సన్ ప్రవీణ్ కుమార్, వాయిస్ చైర్మన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కా శెట్టి చంద్రమోహన్, పిసిసి సెక్రటరీ కె. ఉదయ మోహన్ రెడ్డి, మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చేకూర్త గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మండల నూతన అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ఎం. చంద్రమౌళి, మాజీ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్ మాజీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లారం ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఏఎంసి వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, మిర్జాగూడ బాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, నాయకులు ఎస్. అనంతరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.






