calender_icon.png 4 May, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

03-05-2025 08:58:40 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు..

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల మధ్య కేంద్ర ప్రభుత్వం రూ. 3500 కోట్ల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవానికి, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద బహిరంగ సభకు ఈ నెల 5న కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు.

శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లితో కలిసే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల, చంద్రాపూర్ మధ్య 3500 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి ఈనెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి ప్రారంభోత్సవం, బహిరంగ సభకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకట కృష్ణ, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణ మూర్తి, గుండా ప్రభాకర్, వంగపల్లి వెంకటేశ్వర రావు, వెంకట రమణ రావు, తదితరులు పాల్గొన్నారు.