03-05-2025 09:00:47 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): కార్మిక సమస్యల పరిష్కారం కొరకు వారి హక్కుల సాధన కోసం నిరంతరం ఐఎన్టియుసి కార్మిక సంఘం పాటుపడుతుందని సీనియర్ నాయకులు తేజావత్ రాంబాబు అన్నారు. ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భవ వేడుకలను రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో జెండాను ఆవిష్కరించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు,ఫిట్ సెక్రటరీలు రాములు, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.