16 April, 2026 | 2:26 AM

డిలిమిటేషన్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు

16-04-2026 12:52 AM
  1. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా అమలు చేయాలి 
  2. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  

ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే డిలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని.. కానీ మహిళ రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళా సబ్ కోటాపై స్పష్టత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా డీసీసీ కార్యాలయాన్ని ఆయ న సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రిని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా లో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలపై నాయకులతో కాసేపు మంత్రి చర్చించారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మహిళాలను రాజకీయం గా స్వాగతించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళ్లల ముందుంటుందన్నారు. కానీ బీజేపీ పార్టీ అవిర్భావించిన నాటి నుంచి ఇప్ప టి వరకు ఒక మహిళను సైతం పార్టీ అధ్యక్షురాలు చేసిన చరిత్ర లేదన్నారు. పార్లమెంట్‌లో బలంఉందని, బడుగు వర్గాల మహిళ రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వకుండా చట్టాన్ని తీసుకురావడం సరికాదన్నారు.