calender_icon.png 13 September, 2024 | 1:40 AM

యువకుల వేధింపులకు విద్యార్థిని బలి!

11-07-2024 12:16:11 AM

గడ్డి మందు తాగి బలవన్మరణం 

నల్లగొండ, జూలై 10 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా మాడుగు లపల్లి మండలం కుక్కడం ఆవాసం చింతలగూడెంలో ఇటీవల గడ్డి మం దు తాగిన విద్యార్థిని చికిత్స పొందు తూ మృతిచెందింది. ఆత్మహత్యకు ఇద్దరు యువకులు కారణమంటూ కుటుంబీకులు బుధవారం పోలీసుల కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొత్త కల్యాణి (18) పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఈ నెల 6న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కాసేపటికి గుర్తించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆమెను నల్లగొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలిం చగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అర్రూరి శివ, కొమ్మనబోయి న మధు తమ కూతురిని వేధించడంతోనే కల్యాణి ఆత్మహత్యకు పాల్ప డిందని తల్లి రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.