11-12-2025 12:00:00 AM
ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప
బెజ్జూర్, డిసెంబర్10 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి దుర్గం సరోజ బ్యాగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యకర్తలతో కలిసి బ్యాగు గుర్తును చూపిస్తూ ఇంటింటా ప్రచారం చేశా రు. మంచి అభ్యర్థిని గెలిపిస్తేనే ఊరు అభివృ ద్ధి అవుతుందని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.