11-12-2025 12:00:00 AM
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాం తి): జిల్లాలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటై న జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జైనథ్, తరోడ, అనంత పూర్, దీపాయి గూడ, కూర గ్రామాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజ లను కలుస్తూ బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. అటు ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
గత పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరు జ్యోతిరెడ్డి, రాకేష్, ముకుంద్, కరుణాకర్ రెడ్డి, రాందాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.