23 April, 2026 | 1:56 AM

ఓటర్ మ్యాపింగ్ శాతం పూర్తి చేయాలి

23-04-2026 12:39 AM

వెల్దండ ఏప్రిల్ 22: ఓటర్ మ్యాపింగ్ వంద శాతం పూర్తి చేయాలని కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం వెల్డండ మండల పరిషత్ కార్యాలయంలో తాసిల్దార్ కార్తీక్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రెవెన్యూ, బిఎల్‌ఓ, పంచాయతీ సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం 77 శాతం నుండి 100% సిబ్బందికి సూచించారు.

2002 ఓటరు జాబితాలో ఉన్న పేరు 2025 నాటి ఓటర్ జాబితాలో ఉందా లేదా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటరు జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు ఒకే చోట ఉండే విధంగా చూడాలని తెలిపారు. నిర్దేశించిన గడువులోపల ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉపతహసిల్దార్, గిర్దావర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.