2 June, 2026 | 1:56 AM

మళ్లీ యుద్ధం మొదలైంది!

02-06-2026 01:15 AM
  1. ఇరాన్, అమెరికా ఢీ అంటే ఢీ 
  2. అమెరికన్ డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్ సైన్యం
  3. ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం

వాషింగ్టన్, టెహ్రాన్, జూన్ ౧: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి సోమవారం అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. అమెరికాకు చెందిన ఒక అత్యాధునిక డ్రోన్‌ను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. అమెరికా సైన్యం అందుకు ప్రతిగా ఇరాన్‌లోని గోరుక్, కేశ్మ్ రాడార్ కేంద్రా లు, డ్రోన్ నియంత్రణ స్థావరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది.

మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కువైట్‌లోని ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడు లకు దిగింది. తమ దేశంపై దాడి చేసేందుకు కువైట్ తన ఎయిర్‌బేస్‌ను అమెరికన్ సైన్యానికి ఇచ్చిందని, అందుకే దాడికి దిగా మని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడులను కువైట్ విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఇంకోవైపు, ఇజ్రాయెల్ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఆ దేశం తాజాగా లెబనాన్‌లోని బ్యూఫోర్ట్ కోటను తన ఆధీనంలోకి తీసుకుంది.

లెబ నాన్‌లో ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోకపోవడంతోపాటు ఇరా న్ ఓడరేవులపై ఆంక్షలు కొనసాగిస్తూ అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ ఆరోపించారు. లెబనాన్‌పై కాల్పుల విరమణ పాటించడమే ఏ ఒప్పందానికైనా ప్రధాన షరతు అని పునరుద్ఘాటించారు.