calender_icon.png 21 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వద్దు.. సైబరాబాద్ ముద్దు

21-01-2026 12:12:56 AM

డైరీ ఫామ్ చౌరస్తాలో అఖిల పక్ష నాయకుల మౌన దీక్ష

రాజేంద్రనగర్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే జేఏసీ (అఖిల పక్ష కమిటీ) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అవసరమైతే ఈ ప్రాంత ప్రజలను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మంగళవారం రాజేంద్రనగర్ పరిధిలోని డైరీ ఫామ్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వద్దు  సైబరాబాద్ ముద్దు అనే నినాదంతో మౌన నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ నిరసనలో పాల్గొన్న అఖిల పక్ష నాయకులు పోరెడ్డి ధర్మా రెడ్డి (BRS), పుస్తకాల నర్సింగ్ రావు (CPI), చలసాని విష్ణు మూర్తి (జాగృతి) మాట్లాడుతూ  అత్తాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని,ఈ ప్రాంతాలను సైబరాబాద్ కార్పొరేషన్లోనే యథాతథంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.  ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండిగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు స్వామి, సుభాష్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, సరికొండ వెంకటేష్, జాహిరుద్దీన్ తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు ప్రకటించారు. కార్యక్రమంలో కే నర్సింహారెడ్డి, ముక్రం ఖాన్, జరుద్దీన్, వెంకటేష్, సరికొండ దుర్గేష్, బంగి శ్రీను, లక్ష్మమ్మ, గిరిబాబు, నరేష్ ముదిరాజ్, జీవన్దాస్, సూర్యం, మహాత్మ, ఆసిఫ్ (యూత్ ప్రెసిడెంట్), నరేందర్, డాక్టర్ రవీందర్, దేవదాస్, ఆదిత్య, జైహింద్ రెడ్డి, సదా, అనుదీప్, అజయ్, అశ్వక్, కాజా, అన్వర్, సారంగపాణి, ప్రకాష్, జి. సత్యం, సయ్యద్ కాజా షఫీ, వాణి, నాగార్జున చారి, హుస్సేన్, సాబీర్ ఖలీల్ సహా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.