calender_icon.png 1 May, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

29-04-2025 12:00:00 AM

డీసీసీబీ వైస్ చైర్మన్  కొత్తకుర్మ సత్తయ్య

 గౌరెల్లిలో కొనుగోలు కేంద్ర ప్రారంభించి కొత్తకుర్మ

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 28: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల గౌరెల్లి గ్రామంలో డిస్ట్రిక్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్  కొత్తకుర్మ సత్తయ్య స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ  వినియోగించుకోవాలన్నారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  హయత్ నగర్ పీఏసీఎస్ చైర్మన్ చామ కృష్ణారెడ్డి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, మానిటరింగ్ ఆఫీసర్  బాలరాజు, నాయకులు చెంచల అశోక్,  రైతులు తదితరులు పాల్గొన్నారు.