18 April, 2026 | 1:08 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

సప్లమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు నాలుగో స్థానం

27-06-2025 06:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు గురువారం విడుదల చేసిన పదవ తరగతి  అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా 98.31%తో రాష్ట్రంలో 4వ స్థానంలో  నిలిచిందని నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీ పి. రామారావు గారు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ లతో కలిసి ఒక ప్రకటనలో  తెలిపారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేట యందు ఈనెల 3 నుండి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు జిల్లా నుండి 296 మంది హాజరు కాగా 291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలకు బాలురు 180 మంది హాజరుకాగా 175 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.

అదే విధంగా 116 మంది బాలికలు పరీక్ష రాయగా 116 మంది  బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 100% ఉత్తీర్ణులు కాగా బాలురు 97.22% ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రికౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 500 రూపాయల చెల్లించి 2025 జులై 7లోగా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్ విభాగం హైదరాబాద్ కి నేరుగా పంపవలెనని పేర్కొన్నారు.అదేవిధంగా  రివల్యూవేషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి తమ దరఖాస్తులను సంబంధిత హెడ్ మాస్టర్ల ద్వారా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హైదరాబాదుకు 7 జులై 20 25 లోపు పంపించవలెనని తెలియజేశారు.