27-06-2025 06:34:57 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో బాలుడు మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ కు చెందిన రాజు కుటుంబ సభ్యులతో కలిసి మల్లంపేట్ ఆకాష్ లే అవుట్ లో నివాసముంటున్నాడు. వాళ్ళ కుమారుడు అభిమాన్షు రెడ్డి (6) గీతాంజలి స్కూల్లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాలుడి తల్లి బాబుని తీసుకొని స్కూటీ పై స్కూల్ కు బయలుదేరింది. మార్గమధ్యలో మల్లంపేట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర స్కూటీని టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో టైర్ కిందపడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు.