రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయం
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ (గుడిపల్లి), ఏప్రిల్ 10: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయం. అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.శుక్రవారం గుడిపల్లిమండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామాలలో మౌలిక సదుపాయల కల్పనపై మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటిని వృధా చేయకుండా, జాగ్రత్తగా నీటిని వినియోగించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రానున్న రెండు నెలలు అత్యంత కీలకమైనందున అప్పటి వరకు ఎక్కడా నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రేషన్ కార్డు కలిగిన ఇంటి యాజమాని ప్రమాదశాత్తుతో మరణిస్తే వారి కుటుంబానికి ఆదుకోవడానికి జూన్ 2వ తేదీ నాటి నుండి 5లక్షల రూపాయల ప్రమాద భీమా పథకం ప్రారంభం అవుతుందని అన్నారు.
దళారుల బారిన పడకుండా, రైతులు మద్దతు ధర పొందేలా ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని వారు సూచించారు.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, క్వింటాలుకు రూ.2,389 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అండాలు, తహసీల్దార్ ధీవేనమధువాసిని , మండల స్థాయి అధికారులు, మండల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




