12 March, 2026 | 9:25 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

25-06-2025 12:47 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, జూన్24(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో , పాల్గొని మధురానగర్ చౌరస్తాలో రైతులు, స్థానిక నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే మధుర నగర్ చౌరస్తాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతుభరోసా క్రింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది ప్రభుత్వానిదన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు చేయని తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంఅన్నారు.