13 April, 2026 | 1:56 AM

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

28-06-2024 04:35 AM
  • రవీంద్రభారతిలో ఘనంగా హెలెన్ కెల్లర్ 144 జయంతి వేడుకలు

హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయితీరాజ్, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా మలక్‌పేట వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో హెలెన్ కిల్లర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన హెలెన్ కెల్లర్ 144వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ పుట్టినరోజు అంటే సమస్త దివ్యాంగుల, మానవతావాదులు పుట్టినరోజు అని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం దివ్యాంగులను పూర్తిగా విస్మరించి కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్‌లో కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించిందన్నారు. దివవ్యాంగులను బాధ్యత గా చూడలేని వారు, స్వార్థ ప్రయోజనాల కోసమే వారిని వాడుకునే వారు నిజమైన వికలాంగులని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉన్నతవిద్యలో 5 శాతం రిజర్వేషన్, ఐదేళ్ల వయో సడలింపు కల్పించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.