ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, మార్చి 22 : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అని అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 251 మందికి గాను 92,61000/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన చేశారు కళ్యాణ లక్ష్మి చెక్ లు కొండమల్లేపల్లి, చింతపల్లి,చందంపేట, డిండి మండలల 9911484/- రూపాయల 99 చెక్కులు లబ్దిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం సహాయనిధి ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




