14-01-2026 12:23:34 AM
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలలో పర్యటించిన మంత్రి వివేక్
సిద్దిపేట, జనవరి 13 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాం గ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ సూచించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన పలు అ భివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలోని దుంపలపల్లిలో రూ.2.32 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపాల్ పరిధిలోని పలు వార్డులలో సిసి రోడ్లు, మురికి కాలువలు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశలవారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని, అవసరమైన నిధులను విడుదల చేసి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల నాయకులు పాల్గొన్నారు.