13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గవర్నర్ పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి

14-01-2026 12:22 AM

మఠంపల్లి, జనవరి 13: త్వరలోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  సూర్యాపేట జిల్లా,మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి రానున్నం దున రాష్ట్ర గవర్నర్  పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మట్టపల్లిలో గవర్నర్ రాక ఏర్పాట్ల పై అన్ని శాఖల అధికారులతో  సమావేశం నిర్వహించారు. ముందుగా  జిల్లా కలెక్టర్‌కు ఆలయ పండితులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

రాష్ట్ర  గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని  దేవాదాయశాఖ అధికారులను, ధర్మకర్తలను ఆదేశించారు.  ఆర్డీవో శ్రీనివాసులు, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, అనువంశిక  ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఈవో జ్యోతి, తాహశీల్దార్ మంగా, ఎంపిడిఓ జగదీష్, సర్పంచ్ విజయశాంతి అప్పారావు,జిల్లా అధికారులు హాజరయ్యారు.  వేదపండితులు కలెక్టర్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు.