7 May, 2026 | 1:30 AM

తడిసిన ధాన్యం మిల్లులకి పోవాలి

07-05-2026 12:00 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

జనగామ, మే 6 (విజయక్రాంతి): అకాల వర్షం వల్ల ఈరోజు తడిసిన ధాన్యం త్వరగా కొనుగోలు చేయడం జరుగుతుందని...రైతులు ఆందోళన కు గురి కావద్దని జిల్లా కలెక్టర్  తెలిపారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోం తో కలిసి సివిల్ సప్ప్లై, వ్యవసాయ, కో ఆపరేటివ్, రవాణా,మార్కెటింగ్, డి ఆర్ డి ఎ, మార్క్ ఫెడ్ తదితర శాఖల అధికారులతో గురువారం మినీ కాన్ఫెరెన్స్ హల్ లో కలెక్టర ధాన్యం కొనుగోలు పైన అత్యవసర సమావేశాన్ని  ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం కురిసిన అకాల వర్షం వల్ల  తడిసిన ధాన్యన్ని వెంటనే  కొనుగోలు చేసి.. రవాణ లో ఎలాంటి ఆలస్యం లేకుండా మిల్లింగ్ కి పంపించాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ప్రతీ కేంద్రానికి ఒక ట్రక్ ని  కేటాయించడం జరిగిందని.. ఇంకా అదనంగా కూడా  అవసరమైన కేంద్రాలకు ట్రక్ లను పంపించి. ట్యాగ్ చేసిన మిల్లులకు కొనుగోలు అయిన ధాన్యన్ని తరలించాలన్నారు దాన్యం దిగుమతి లో మిల్లర్ లు ఇబ్బందులకు గురి చేయకుండా.. అధికారులు కూడా ప్రతీ మిల్ ని పర్యవేక్షణ  చేయాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో.. ప్రతీ కేంద్రం లో అదనపు  టార్ఫాలిన్  లని సిద్ధం గా పెట్టుకోవాలన్నారు.

ఏఈ ఓ లు ప్రతీ కేంద్రాన్ని విజిట్ చేస్తు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా సాగేలా ప్రతీ రోజూ కేంద్రం లో అందుబాటులోఉండాలన్నారు. నర్మేట్ట, తరిగొప్పుల మండలాల రైతులకు ఉపయోగ పడేలా అనువైన ప్రదేశం లో రేపు ఒక మొక్కజొన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ వెంటనే ప్రారంభించాలన్నారు. కొనుగోలు చేసిన మక్కలను నిర్దేశించిన గోదాం లలో భద్రపరచాలన్నారు.  ఈ సమావేశం లో డి సి ఓ, ఇంచార్జ్ డి ఆర్ డి ఏ, సివిల్ సప్ప్లె డి ఎం,మార్కెటింగ్,ఇంచార్జ్ మార్క్ ఫెడ్ అధికారి,రవాణా  తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.