20-09-2025 01:07:36 AM
నార్సింగి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం భాగ్యనగ రానికి వచ్చిన ఓ జంట కథ విషాదాంతమైంది. వేధింపులను తట్టుకోలేక కత్తితో భర్త ప్రాణం తీసింది. ఘటన కోకాపేటలో గురువారం రాత్రి జరిగింది. అస్సాంకు చెం దిన భరత్ బరోడా, కృష్ణ జ్యోతి బోరా దం పతులు, పొట్టచేతబట్టుకొని నగరానికి వచ్చి, కోకాపేటలో నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భరత్ తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈక్రమంలోనే గురువారం అర్ధరాత్రి వీరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే కృష్ణజ్యోతి వంటింట్లో ఉన్న కత్తితో భర్తపై విచక్షణరహితంగా దాడి చేసిం ది. కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చారు. రక్తపు మడుగుల్లో ఉన్న భరత్‌ను స్థానిక దవాఖానకు తరలించారు. అప్పటికే శరీరంలో చాలా రక్తం పోవడంతో చికిత్స పొం దుతూ మృతిచెందాడు. పోలీసులు కృష్ణజ్యోతిని అదుపులోకి తీసుకున్నారు.