calender_icon.png 20 September, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే లక్ష్యం

20-09-2025 01:05:30 AM

-7,500 మంది రైతులకు 242 కోట్ల పంట రుణాలు

-7.18 కోట్ల లాభాలు ఆర్జించాం

-ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి)ః రైతు సంక్షేమమే సహకార సంఘం లక్ష్యమని ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షుడు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం 69వ వార్షిక మహాసభలో ప్రవీణ్‌రెడ్డి మాట్లాడారు. సహకారంగంలో అతిపెద్దదైన ముల్కనూరు సంఘం ఈ సంవత్సరం 47 కోట్ల వ్యాపారం చేసి ౭.18 లక్షల లాభాలు ఆర్జించామన్నారు.

సహకార సంఘంలోని 7500 మంది రైతులకు పంట రుణాల కింద 242 కోట్ల రూపాయలు అందించామన్నారు.  సహ కార సంఘం వచ్చిన లాభాలను బోనస్ రూపంలో మూడు కోట్ల 75 లక్ష లు విజయదశమి  సందర్భంగా రైతులకు పంపిణీ చేశామన్నారు. రైతులు పండించిన సన్న వడ్లకు 200 బోనస్, దొడ్డు వడ్లకు రూ.వంద , పత్తికి రూ.300 అందించామన్నారు. సంఘంలోని రైతులకు దహన సంస్కారాల కింద 33 లక్షలు, రైతుల పంట అప్పుమాఫీ 163 మంది రైతులకు కోటి 25 లక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

రైతు కుటుంబాల విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద 123 మంది విద్యార్థులకు 20 లక్షలు, ఏకేవీఆర్ పెన్షన్ కింద 700 మందికి 71 లక్ష రూపాయలు అందించామన్నారు.  రానున్న రోజుల్లో రైతులను  అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేయడమే లక్ష్యమన్నారు. సమావేశంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ మార్పాటి రామ్ రెడ్డి బ్యాంకు ఉపాధ్యక్షుడు గజ్జి వీరయ్య, భీమ్ రెడ్డి, గూటం జోగిరెడ్డి పాల్గొన్నారు.