30-07-2025 07:18:12 PM
మేడిపల్లి: ఇంట్లో ఉన్న మహిళ అర్థరాత్రి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ దేవేంద్రనగర్ కాలనీలో వేలంగి రావు తన భార్య శ్రావణి(26)తో కలిసి తన భార్య సోదరి సుమలత ఇంట్లో గత నెల రోజులుగా ఉంటున్నారు. ఈనెల 28న రాత్రి ఫిర్యాదుదారుడు వేలంగి రావు తన డ్యూటీకి వెళ్ళాడు. అనంతరం అక్కా చెల్లెలు ఇంట్లోకి వెళ్లి నిద్రపోయారు. రాత్రి1:30 గంటలకి సుమలత లేచి చూడగా తన సోదరి శ్రావణి కనబడలేదు. ఎంత వెతికిన ఇప్పటికి సమాచారం తెలియకపోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.